అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kerala | దేశవ్యాప్తంగా గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాలే కేంద్రంగా పలువురు గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. యువతను మత్తుకు బానిసలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అయితే గంజాయి, డ్రగ్స్ రవాణా కోసం వీరు పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో దందా నడుపుతున్నారు.
ట్రాలీ బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ (West Bengal)కు చెందిన అనితా ఖాతున్ బీబీ, సోనియా సుల్తానాను కేరళ (Kerala)లోని ఎర్నాకుళం స్టేషన్‌లో రైల్వే పోలీసులు (Railway Police) అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 37 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన వీరు పలు ప్రధాన నగరాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.