అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Passengers | దేశవ్యాప్తంగా రవాణా రంగంలో రైల్వేలది కీలక పాత్ర. దేశంలో ఎక్కువ శాతం ప్రజలు రైళ్లలోనే రాకపోకలు సాగిస్తారు. భారతీయ రైల్వే(Indian Railways) నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలు చేరవేస్తుంది.
ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని రైల్వేశాఖ(Railway Department) పలు కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే వేగవంతమైన ప్రయాణం కోసం వందే భారత్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే రైళ్లలో పరిశుభ్రత, ప్రయాణికుల భద్రతపై ఎప్పటి నుంచే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా అన్ని బోగీలలో సీసీ కెమెరాలు(CCTV Cameras) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Railway Passengers | ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా..
ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ అన్ని కోచ్‌లు డోర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రైళ్లలో దొంగల బెడద అధికంగా ఉంది. ఇటీవల రైలు దోపిడీ(Train Robbery) ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దారి మధ్యలో రైళ్లను ఆపి దొంగలు ప్రయాణికులను దోపిడీ చేశారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే రైల్వేశాఖ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Railway Passengers | అక్కడ సక్సెస్ కావడంతో
రైల్వే కోచ్(Railway Coach)లకు సీసీ కెమెరాల ఏర్పాటును నార్తరన్ రైల్వే పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 74 వేల కోచ్‌లు, 15 వేల లోకో కోచ్‌లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Railway Passengers | ఆధునిక సీసీ కెమెరాలు..
ప్రతి కోచ్ ఎంట్రీల వద్ద సీసీ కెమెరాలు అమర్చనున్నారు. లోకో కోచ్‌లకు ద్వారాలతో పాటు ముందు, వెనుకతో కలిపి ఆరు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. చీకట్లో సైతం వీడియో మంచిగా వచ్చేలా ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.