అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Moneylenders | వడ్డీ వ్యాపారులు (Moneylenders) ప్రజలను వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. అధిక వడ్డీలతో (Interest Rates) ప్రజల నడ్డీ విరుస్తున్నారు.
వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక గతంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సిరిసిల్ల (Siricilla) జిల్లావ్యాప్తంగా గురువారం వడ్డీ వ్యాపారుల ఇళ్లలో దాడులు చేశారు.
జిల్లావ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ చేస్తున్న వారిపై ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి గీతే (SP Mahesh B Geete) తెలిపారు. వారి నుంచి రూ.60 లక్షల విలువ గల డాక్యుమెంట్లను, తాకట్టు పెట్టుకున్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మనీలాడరింగ్ యాక్ట్ ప్రకారం పది మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు.
Moneylenders | అడ్డగోలుగా వడ్డీ వసూలు
రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులు అడ్డగోలుగా మిత్తి వసూలు చేస్తున్నారు. రూ.మూడు నుంచి రూ.10 వరకు వడ్డీ తీసుకుంటున్న వారు ఉన్నారు. అత్యవసరం అయితే అధిక వడ్డీ తీసుకుంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్లకు పాల్పడే వారు అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని.. అవి కట్టలేక కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. కొంత మంది అప్పుల బాధతో తనువు చాలిస్తున్నారు. గతంలో చాలా మంది ఇలా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు.
Moneylenders | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సైతం
ఉమ్మడి నిజామాబాద్(Nizamabad) జిల్లాలో సైతం వడ్డీ వ్యాపారులు భారీగానే ఉన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. వడ్డీ వ్యాపారం చేస్తున్న ఓ కానిస్టేబుల్ (Constable) సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఇటీవల సస్పెండ్ చేశారు. గతంలో నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు సైతం వడ్డీ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అయినా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు.