అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Caste Census | దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాని కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ rahul gandhi విజయమని సీఎం రేవంత్‌రెడ్డి cm revanth reddy అన్నారు. గురువారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
జనగణనతో పాటు కులగణన caste census చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కులగణన జరగాలని రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా డిమాండ్ చేశారని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టామని ఆయన తెలిపారు.
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కుల గణన చేపట్టామన్నారు. 95 వేల ఎన్యుమరేటర్లతో సర్వే survey నిర్వహించామని వివరించారు. సర్వే పర్యవేక్షణకు సూపర్వైజర్లు, ప్రత్యేకాధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. కుల గణన చేపట్టి అసెంబ్లీ assemblyలో బిల్లు bill పాస్ చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. కుల గణన బిల్లు ఆమోదించాలని ఢిల్లీ delhi జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేశామన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన caste census కోసం కేంద్ర మంత్రులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం నిపుణుల కమిటీతో ప్రజల అభిప్రాయాలు సేకరించాలన్నారు. ఆ తర్వాతే కులగణన చేపట్టాలని కోరారు. తెలంగాణ తరహాలో సర్వే చేయాలని సూచించారు. కేంద్రం తీసుకున్న కుల గణన నిర్ణయంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కేంద్రం కులగణన ఎప్పుడు మొదలు పెట్టి, ఎప్పుడు పూర్తి చేస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు.