అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ(Congress Party) చేపట్టిన ఓ కార్యక్రమం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
రాష్ట్రంలోని మహిళల్లో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ ‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’ (Priyadarshini Udan Yojana) పేరుతో ఉచిత శానిటరీ ప్యాడ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఐదు లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది బీహార్ ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మై బహిన్ సమ్మాన్ యోజన’కు ప్రత్యామ్నాయంగా చేపట్టిన చర్యగా పార్టీ చెబుతోంది.
Rahul Gandhi | ఇదేం పని?
అయితే ఈ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) , ప్రియాంక గాంధీ చిత్రాలు ఉండటమే వివాదాస్పదంగా మారింది. ఇది ఎన్నికల ప్రచార గిమ్మిక్ మాత్రమేనని ఎన్డీయే కూటమి పార్టీలు విమర్శించాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(CM Nitish Kumar) పార్టీకి చెందిన జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ (Neeraj Kumar) వ్యాఖ్యానిస్తూ, “మహిళల కోసం ఉద్దేశించిన వాటిపై రాజకీయ నాయకుల ఫొటోలు అవసరమా? ఇది ఆచరణాత్మక పథకం కాదని స్పష్టంగా చెబుతోంది.” అంటూ ఎద్దేవా చేశారు.
ఈ విమర్శలపై కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఘాటుగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ, “ప్యాడ్‌పై రాహుల్ గాంధీ ఫొటో ఉందని ప్రశ్నించకండి. బీహార్‌లో ఇప్పటికీ అనేక యువతులు రుతుక్రమ సమయంలో బట్ట ముక్కలు వాడుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా ఎంత ప్రమాదమో ఎవరికి తెలుసు. మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడే స్థాయి బీజేపీకి లేదు. వాళ్లు ఎప్పటికీ మహిళా వ్యతిరేక మానస్తత్వం కలిగి ఉంటారు అంటూ బీజేపీ(BJP)పై ధ్వజమెత్తారు. ఈ ఘటనతో బీహార్ రాజకీయాల్లో మహిళల ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలు కీలకంగా మారాయి. శానిటరీ ప్యాడ్(Sanitary Pad)ల పంపిణీ అభినందనీయమా? లేక అది ఓ రాజకీయ ప్రచార పద్దతిమాత్రమేనా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు శానిటరీ ప్యాడ్స్ ప్యాకెట్స్‌పై ఇలా ఫొటోలు ప్రింట్ చేయించుకోవడం అవసరమా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.