అక్షరటుడే, వెబ్‌డెస్క్: FATF report | ఆధునిక టెక్నాలజీని ఉగ్రవాదులు కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఉగ్ర దాడులకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి, ప్లాన్ అమలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్(E-commerce platforms)లు, అమెజాన్, పేపాల్ వంటి డిజిటల్ చెల్లింపు సేవలను ఎక్కువగా దోపిడీ చేస్తున్నారు.
అలాగే, పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల నుంచే కొనుగోలు చేస్తున్నారు. 2019లో జరిగిన పుల్వామా దాడిలో (Pulwama attack) వినియోగించిన ఆర్ డీఎక్స్ దాడికి అవసరమైన రసాయనాలను అమెజాన్ నుంచి కొనుగోలు చేశారు. ఇలాంటి అనేక సంచలన విషయాలను గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (Financial Action Task Force) నివేదిక వెల్లడించింది. “కాంప్రెహెన్సివ్ అప్ డేట్ ఆన్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్” పేరిట ఎఫ్ఏటీఎఫ్ తాజాగా వెలువరించిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ నెట్వర్క్ లను సద్వినియోగం చేసుకుంటూ ఉగ్రవాదులు ఆధునిక ఆర్థిక సాధనాలకు త్వరగా ఎలా అలవాటు పడుతున్నారో, నిధుల సమీకరణ చేస్తున్న ఏ విధంగా ఆన్ లైన్ దోపిడీలకు పాల్పడుతున్నారో నివేదిక స్పష్టంగా వివరించింది.
FATF report | పుల్వామా, గోరఖ్ నాథ్ దాడి అలాగే..
ఇండియాలో జరిగిన ఉగ్రదాడులను ఎఫ్ఏటీఎఫ్ నివేదిక (FATF report) కేస్ స్టడీగా ఎత్తి చూపుతూ, వాటి వెనుక జరిగిన పరిణామాలను వివరించింది. దారుణమైన పుల్వామా ఉగ్రవాద దాడి, గోరఖ్ నాథ్ ఆలయ దాడి కోసం ఉగ్రవాదులు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్లను డబ్బును తరలించడానికి, పేలుడు పదార్థాలను సేకరించడానికి ఎలా ఉపయోగించుకున్నాయో స్పష్టంగా వెల్లడించింది. 2019లో జేషే మహమ్మద్ సీఆర్పీఎఫ్ సైనికులను హతమార్చడానికి ఉపయోగించిన ఆర్డీఎక్స్ లో వినియోగించిన రసాయనాన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపింది. అలాగే, 2022లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో భద్రతా సిబ్బందిపై జరిగిన దాడిలో ఏకైక నిందితుడు పేపాల్ ఉపయోగించి ఇస్లామిక్ స్టేట్ కు నిధులను బదిలీ చేశాడని పేర్కొంది.
FATF report | ఆన్ లైన్ ద్వారానే..
ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ను ఉపయోగించుకుంటున్న ధోరణిని పుల్వామా, గోరఖ్ నాథ్ ఉగ్రదాడి (Gorakhnath temple attack) కేసులు ఎత్తి చూపుతున్నాయి. “భారతదేశంలోకి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు సరిహద్దు దాటినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముఖ్యంగా, దాడిలో ఉపయోగించిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరంలో కీలకమైన భాగం – అల్యూమినియం పౌడర్ – EPOM అమెజాన్ నెట్వర్క్ ద్వారా సేకరించారు. ఈ పదార్థం పేలుడు ప్రభావాన్ని పెంచడానికి ఉపయోగించినట్లు” ఎఫ్ఏటీఎఫ్ నివేదిక తెలిపింది.
పుల్వామా దాడిపై జాతీయ విచారణ సంస్థ (National Investigation Agency) చేపట్టిన దర్యాప్తులోనూ ఈ అంశం వెలుగులోకి వచ్చింది. వైజ్-ఉల్-ఇస్లాం అనే నిందితుడిని విచారించగా, పాకిస్తానీ JeM ఉగ్రవాదుల ఆదేశాల మేరకు IEDలు, బ్యాటరీలు, ఇతర ఉపకరణాలను తయారు చేయడానికి రసాయనాలను సేకరించడానికి తన అమెజాన్ ఖాతాను ఉపయోగించినట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని NIA తన ఛార్జ్షీట్లో పేర్కొంది. “నిందితుడు సజ్జాద్ భట్ IED దాడి చేయడానికి మారుతి ఈకో కారును కొనుగోలు చేశాడు” అని తెలిపింది.
ఇక ఏప్రిల్ 3, 2022న నిందితుడు ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో ప్రభావితమై గోరఖ్ నాథ్ ఆలయంలోని భద్రతా సిబ్బందిపై దాడి చేశాడని ఎఫ్ఏటీఎఫ్ నివేదిక తెలిపింది. నిందితుడు తన ఆధారాలు దొరకకుండా తప్పించుకోవడానికి కాల్స్ చేయడానికి, చాటింగ్ చేయడానికి VPNని ఉపయోగించాడని పేర్కొంది. అలాగే, థర్డ్ పార్టీ లావాదేవీలను ఉపయోగించి 44 పేమెంట్స్ చేశాడని పేర్కొంది. ఇలా ఆన్ లైన్ వేదికలను ఉపయోగించుకుని ఉగ్రదాడులకు (terrorist attacks) పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోందని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది.