అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఓవైపు జిల్లాలో పర్యటిస్తున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలో రహదారులు బాగాలేవని, గుంతల రోడ్డులో వరినాట్లు వేసి ప్రజలు నిరసన తెలిపారు.
కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వెళ్లే రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలం కావడంతో గుంతల్లో నీళ్లు నిండి కనిపించడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో గమనించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో వినూత్న నిరసనకు దిగారు. సోమవారం అశోక్ నగర్ కాలనీ (Ashok Nagar Colony) వాసులు రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల వద్ద వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.
Kamareddy | ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా..
ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం (Road Construction) చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భారీ గుంతలతో ప్రమాదాల బారిన పడితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టి, మురికి కాల్వలు నిర్మించి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు అర్కల ప్రభాకర్ యాదవ్, కౌన్సిలర్, జగదీష్ యాదవ్, లోలపు శ్రీనివాస్, గంగారం యాదవ్, దినేష్ రెడ్డి, నరేందర్, రాజేష్, శ్రీనివాస్, దేవదాస్, ఎల్లేశ్, కాలనీ మహిళలు పాల్గొన్నారు.