అక్షరటుడే, కామారెడ్డి: Head Constable Promotions | పోలీసులకు పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chadra ) అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన 13 మంది కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందిస్తూ వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాసేవలో నిజాయితీగా విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్ లభిస్తుందని, అలాగే బదిలీ ప్రక్రియలో విల్లింగ్ స్టేషన్‌లు(Willing stations), సీనియారిటీ, దంపతుల సేవలు, ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకొని బదిలీలు జరుపుతున్నట్లు తెలిపారు.
Head Constable Promotions | పదోన్నతి పొందిన వారి వివరాలివే..
ఏ.రామేశ్వర్ రెడ్డి-లింగంపేట, మధుకర్-ఎల్లారెడ్డి, ఏ.దేవేందర్-లింగంపేట్, బీఎం. రాజు-దేవునిపల్లి, సీహెచ్. సాయిలు-బిచ్కుంద, జి.రాజ్ కుమార్-బిచ్కుంద, ప్రిన్స్ బాబు-వీఆర్, పి.అనిల్ కుమార్-రాజంపేట, రామారావు-మాచారెడ్డి, సీహెచ్ స్వామి-మాచారెడ్డి, సీహెచ్ శ్రీనివాస్-నాగిరెడ్డిపేట, సీహెచ్ మహేందర్-వీఆర్, సంజీవులు-దేవునిపల్లి ఉన్నారు.