అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dhankhar Resign | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలం ప్రజా సేవలో పాల్గొన్నారని ప్రశంసించారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియా(Social Media)లో ఓ ఇంగ్లిష్, హిందీలో పోస్టు చేశారు. ధన్‌ఖడ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సేవ పట్ల ఆయన దీర్ఘకాల నిబద్ధతను ఈ సందర్భంగా ప్రధాని హైలైట్ చేశారు. తన కెరీర్‌లో వివిధ హోదాల్లో ధన్‌ఖడ్ చేసిన కృషిని ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రశంసించారు. ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు అందివ్వాలని ఆకాంక్షించారు.
Dhankhar Resign | అనేక అవకాశాలు..
ప్రజలకు సేవ చేయడానికి ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయని మోదీ తెలిపారు. “జగదీప్ ధన్‌ఖడ్ జీకి (Jagadeep Dhankhar) భారత ఉపరాష్ట్రపతిగా సహా వివిధ హోదాల్లో మన దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి. ఆయనకు మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాను” అని పోస్టులో రాశారు. ఇదే సందేశాన్ని ఆయన హిందీలోనూ పోస్టు చేశారు.
Dhankhad Resign | అనూహ్య రాజీనామా.
ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేశారు. సోమవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఆయన పదవి నుంచి తప్పుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా (Resign) చేస్తున్నానని, తక్షణమే ఆమోదించాలని కోరుతూ ధన్‌ఖడ్ రాష్ట్రపతికి లేఖ పంపించారు.
వివిధ పార్టీల్లో పని చేసిన ఆయన ఎంతో నిక్కచ్చిగా, నిజాయతీగా వ్యవహరించారు. గవర్నర్‌గా, ఉప రాష్ట్రపతిగా (Vise President) విశేష సేవలందించారు. ఉప రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీకాలంలో కీలకంగా వ్యవహరించారు. ఏ పార్టీ అయినా తప్పును తప్పుగానే ఎత్తిచూపారు. ఒకానొక దశలో కేంద్రంతో విభేదించారు. అలాగే, విపక్ష పార్టీలను సైతం ఆయన తూర్పారబట్టారు. ఇక, న్యాయవ్యవస్థతోనూ తలపడ్డారు. అభిశంసనను ఎదుర్కొన్న ఉప రాష్ట్రపతిగా చరిత్రకెక్కిన ధన్‌ఖడ్.. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా తప్పుకున్నారు.