More
    Homeబిజినెస్​PRE MARKET ANALYSIS | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    PRE MARKET ANALYSIS | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PRE MARKET ANALYSIS : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా కనిపిస్తున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు పాజిటివ్‌గా ముగియగా.. యూరోప్‌ మార్కెట్లు నెగెటివ్‌గా ట్రేడ్‌ అయ్యాయి. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

    PRE MARKET ANALYSIS : వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీ(Rally on Wall Street)..

    గత ట్రేడింగ్‌ సెషన్‌లో అమెరికాకు చెందిన నాస్‌డాక్‌(Nasdaq) 0.67 శాతం, ఎస్‌అండ్‌పీ 0.41 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.28 శాతం నష్టంతో కదలాడుతోంది.

    PRE MARKET ANALYSIS : నెగెటివ్‌గా యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) ఫ్లాట్‌గా ముగియగా.. డీఏఎక్స్‌ 0.28 శాతం, సీఏసీ 0.19 శాతం నష్టపోయాయి.

    PRE MARKET ANALYSIS : పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ప్రధాన ఆసియా మార్కెట్లు మంగళవారం లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో హంగ్‌సెంగ్‌(Hang Seng) 1.30 శాతం లాభాలతో ఉండగా తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ 0.59 శాతం, షాంఘై 0.33 శాతం, నిక్కీ 0.20 శాతం కొనసాగుతున్నాయి. స్ట్రెయిట్‌ టైమ్స్‌ మాత్రం శాతం ఫ్లాట్‌గా కదలాడుతోంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.29 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  Stock Market | వచ్చే వారంలో మార్కెట్ల పయనమెటు?

    PRE MARKET ANALYSIS : గమనించాల్సిన అంశాలు..

    • ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(FII) వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నెట్‌ సెల్లర్లుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 2,589 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. కాగా మార్కెట్‌లో అనిశ్చితులున్నా డీఐఐ(DII)ల జోరు కొనసాగుతోంది. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో నికరంగా రూ. 5,313 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.62 శాతం పెరిగి 62.91 డాలర్లకు చేరింది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 20 పైసలు బలపడి 85.38 వద్ద ఉంది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.13 శాతం తగ్గి 98.83 కి, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.09 శాతం పెరిగి 4.45 కు చేరాయి.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.76 నుంచి 0.82కు పెరగ్గా.. విక్స్‌(VIX) 6.72 శాతం పెరిగి 17.16 వద్ద ఉంది. పీసీఆర్‌తోపాటు విక్స్‌ పెరగడం బుల్స్‌కు ప్రతికూలం.
    • అమెరికా ప్రతిపాదించిన న్యూక్లియర్‌ డీల్‌ను ఇరాన్‌ తిరస్కరించింది.
    • రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జియో పొలిటికల్‌ టెన్షన్స్‌ కొనసాగుతున్నా, అమెరికా, వివిధ దేశాల మధ్య ట్రేడ్‌ డీల్స్‌(Trade deals) విషయంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా గత ట్రేడింగ్‌ సెషన్‌లో మన మార్కెట్లు కోలుకున్నాయి. ఇది మన మార్కెట్లలోని బలాన్ని సూచిస్తుందని అనలిస్టులు పేర్కొంటున్నారు.
    • ఈనెల 6వ తేదీన ఆర్‌బీఐ(RBI) ఎంపీసీ మీటింగ్‌ ఉంది.
    • సెన్సెక్స్​ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో ఓలటాలిటీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
    READ ALSO  Stock Market | స్టాక్‌ మార్కెట్​లో కొనసాగిన ర్యాలీ

    Latest articles

    PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై పీసీసీ అధ్యక్షుడు...

    Rashmika Mandanna | డిఫ‌రెంట్ ల‌వ్ సింబ‌ల్స్ చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ర‌ష్మిక మందాన‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rashmika Mandanna | ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది ర‌ష్మిక మందాన‌....

    Minister Vivek Venkata Swamy | మంత్రిని కలిసిన అంబేడ్కర్​ సంఘం నాయకులు

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Vivek Venkata Swamy | రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, మైనింగ్ శాఖ మంత్రి...

    Uttar Pradesh | నోయిడాలో బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ల‌వ‌ర్స్.. తిక్కకుదిర్చిన పోలీసులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | ఈ మధ్య కాలంలో ప్రేమికుల(Lovers) ఆగ‌డాలు ఎక్కువైపోతున్నాయి. మ‌నం స‌మాజంలో...

    More like this

    PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:PCC Chief Mahesh Goud | మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)పై పీసీసీ అధ్యక్షుడు...

    Rashmika Mandanna | డిఫ‌రెంట్ ల‌వ్ సింబ‌ల్స్ చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ర‌ష్మిక మందాన‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rashmika Mandanna | ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది ర‌ష్మిక మందాన‌....

    Minister Vivek Venkata Swamy | మంత్రిని కలిసిన అంబేడ్కర్​ సంఘం నాయకులు

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Vivek Venkata Swamy | రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, మైనింగ్ శాఖ మంత్రి...