అక్షరటుడే, డిచ్పల్లి: PDSU | జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) పర్యటన సందర్భంగా పీడీఎస్‌యూ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. నగరంలోని పీడీఎస్‌యూ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం వారిని అరెస్ట్ చేసి నాలుగో టౌన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా నాయకులు నిఖిల్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
PDSU | వర్సిటీలో సమస్యలెన్నో..
తెయూ (Telangana University) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్నాతకోత్సవానికి (Graduation ceremony) యూనివర్సిటీ విద్యార్థులను పిలవకపోవడం విచారకరమని వారన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వివరించేందుకు గవర్నర్‌ను విన్నవించాలని భావించామన్నారు. తెయూలో ఇంజినీరింగ్ కోర్సులను తీసుకురావాలని, బాలికల హాస్టల్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. నూతన యూజీసీ(UGC) ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.