అక్షరటుడే ఇందూరు: Power Cut | నగరంలోని వినాయక్ నగర్ (Vinayak nagar) ఉపకేంద్రం (Sub station) పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ చంద్రశేఖర్ తెలిపారు.
కొత్త 33కేవీ (33KV) టవర్ నిర్మాణ పనులు చేస్తున్నందున సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆయన వివరించారు. 100 ఫీట్ రోడ్, కామాక్షి, సాయి నిలయం, మీనాక్షి, పద్మావతి అపార్ట్మెంట్, భవానీనగర్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.