More
    Homeఅంతర్జాతీయంWorld Bank | ప‌దేళ్ల‌లో పేద‌రికం గ‌ణ‌నీయంగా త‌గ్గుద‌ల‌.. ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక వెల్ల‌డి

    World Bank | ప‌దేళ్ల‌లో పేద‌రికం గ‌ణ‌నీయంగా త‌గ్గుద‌ల‌.. ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక వెల్ల‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:World Bank | ద‌శాబ్దాలుగా పేద‌రికంతో కొట్టుమిట్టాడిన‌ భార‌త్(India) దాని నుంచి మెల్లిగా బ‌య‌ట ప‌డుతోంది. మోదీ(Modi) హ‌యాంలో ఆర్థిక వృద్ధి ప‌రుగులు పెట్ట‌డంతో దుర్భ‌ర ప‌రిస్థితుల నుంచి బ‌య‌టికొస్తోంది. దారిద్య్ర రేఖ దిగువ‌న ఉన్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశం పేదరికాన్ని గణనీయంగా తగ్గించింద‌ని ప్ర‌పంచ బ్యాంక్(World Bank) వెల్ల‌డించింది. 2011-12లో తీవ్ర పేదరికం 16.2% ఉండ‌గా, దాన్ని 2022-23 నాటికి 2.3%కి తగ్గించ‌గ‌లిగింది. 171 మిలియన్ల మందిని దారిద్య్రరేఖ నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చింద‌ని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.

    World Bank | గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువ‌

    భార‌త్‌లో గ్రామీణ ప్రాంతంలోనే పేద‌రికం(Poverty) ఎక్కువ‌గా ఉంటుంది. దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉండే వారి సంఖ్య అధికంగా రూర‌ల్ ఏరియా(Rural Area)లో నే ఉంది. అయితే ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్ల గ్రామీణ తీవ్ర పేదరికం 18.4% నుంచి 2.8%కి ప‌డిపోయింది. పట్టణాల్లోనూ 10.7% నుంచి 1.1%కి తగ్గింది. అలాగే, గ్రామీణ-పట్టణ అంతరాన్ని 7.7 నుంచి 1.7 శాతం పాయింట్లకు తగ్గించింది. “భారతదేశం కూడా దిగువ-మధ్య-ఆదాయ వర్గంలోకి మారిపోయింది. దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ఆదాయం రోజు 3.65 డాల‌ర్ల‌కు(Dollars) చేరింది. పేదరికం 61.8 శాతం నుంచి 28.1 శాతానికి పడిపోయింది. 378 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చింది” అని ప్ర‌పంచ నివేదిక పేర్కొంది. గ్రామీణ పేదరికం 69శాతం నుంచి 32.5 శాతానికి, పట్టణ పేదరికం 43.5 శాతం నుంచి 17.2శాతానికి తగ్గిందని, గ్రామీణ-పట్టణ అంతరాన్ని 25 నుంచి 15 శాతం పాయింట్లకు తగ్గించిందని తెలిపింది.

    World Bank | ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్య‌ధికం

    అత్యధిక జనాభా(Highest population) కలిగిన ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. మధ్యప్రదేశ్‌ల‌లో 2011-12లో దేశంలోనే అత్యంత పేదరికంలో 65 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2022-23 నాటికి తీవ్ర పేదరికంలో మొత్తం తగ్గుదల్లో మూడింట రెండు వంతులకు ఇవి దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఆయా రాష్ట్రాలు ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత పేదవారిలో 54 శాతం (2022-23) కలిగి ఉన్నాయని ప్ర‌పంచ బ్యాంక్(World Bank) తెలిపింది. అలాగే, ఉపాధి వృద్ధి రేటు పెరుగుతుంద‌ని, త‌ద్వారా నిరుద్యోగిత త‌గ్గుతోంద‌ని వెల్ల‌డించింది.

    Latest articles

    Farmer MLA Bigala | కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షం: బిగాల

    అక్షరటుడే, ఇందూరు:Farmer MLA Bigala | కేసీఆర్(KCR) పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్...

    Nizamabad City | నగరంలో చోరీ

    అక్షరటుడే, ఇందూరు:Nizamabad City | నగరంలోని పులాంగ్ పాత బ్రిడ్జి(Pulong Old Bridge) వద్ద ఓ ఇంట్లో చోరీ...

    Bharatiya Janata Kisan Morcha | హమాలీలు లేరు.. గన్నీబ్యాగులు కరువు..

    అక్షరటుడే, ఆర్మూర్: Bharatiya Janata Kisan Morcha | కొనుగోలు కేంద్రాల్లో హామాలీల్లేక ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయని...

    London | భారతీయుల పీక కోస్తామన్న పాక్​ అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : London | పాకిస్తాన్ pakistan​ తన తీరు మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని  terrorism పెంచి...

    More like this

    Farmer MLA Bigala | కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షం: బిగాల

    అక్షరటుడే, ఇందూరు:Farmer MLA Bigala | కేసీఆర్(KCR) పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్...

    Nizamabad City | నగరంలో చోరీ

    అక్షరటుడే, ఇందూరు:Nizamabad City | నగరంలోని పులాంగ్ పాత బ్రిడ్జి(Pulong Old Bridge) వద్ద ఓ ఇంట్లో చోరీ...

    Bharatiya Janata Kisan Morcha | హమాలీలు లేరు.. గన్నీబ్యాగులు కరువు..

    అక్షరటుడే, ఆర్మూర్: Bharatiya Janata Kisan Morcha | కొనుగోలు కేంద్రాల్లో హామాలీల్లేక ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయని...
    Verified by MonsterInsights