అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : గ్లోబల్ మార్కెట్లు(Global markets) లాభాల బాటలో సాగుతున్నాయి. యూఎస్, యూరోప్ మార్కెట్లు ర్యాలీ తీశాయి. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో ట్రేడ్(Trade) అవుతున్నాయి.
Pre Market Analysis : యూఎస్ మార్కెట్లు(US markets)..
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య సీజ్‌ఫైర్(Ceasefire)తో వాల్‌స్ట్రీట్ పరుగులు తీస్తోంది. గత ట్రేడిరగ్ సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 1.43 శాతం ఎస్‌అండ్‌పీ 1.11 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు(European markets)..
డీఏఎక్స్ 1.58 శాతం, సీఏసీ(CAC) 1.03 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.01 శాతం పెరిగాయి.
Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..
ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆసియా మార్కెట్ల(Asian markets)లో ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం 7.50 గంటల సమయంలో హంగ్‌సెంగ్(Hang Seng) 0.89 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.66 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.59 శాతం, కోస్పీ 0.36 శాతం, నిక్కీ 0.17 శాతం, షాంఘై 0.08 శాతం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.40 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 5,266 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు నికరంగా రూ. 5,209 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.04 నుంచి 0.85కి తగ్గింది. విక్స్(VIX) 2.88 శాతం తగ్గి 13.64 వద్ద ఉంది. ఇది బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తోంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 68.02 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 79 పైసలు బలపడి 85.97 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.09 శాతం తగ్గి 97.86 వద్ద ఉండగా.. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 0.26 శాతం పెరిగి 4.31 వద్ద నిలిచింది.