More
    Homeఅంతర్జాతీయంRoll Cloud | బీచ్‌లో వింత మేఘాన్ని చూసి భ‌య‌ప‌డ్డ ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్

    Roll Cloud | బీచ్‌లో వింత మేఘాన్ని చూసి భ‌య‌ప‌డ్డ ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Portugal | ఇటీవ‌ల వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వింత‌లు ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. తాజాగా పోర్చుగల్‌లోని పోవోవా డో వర్జిమ్ బీచ్‌(Povoa do Verjim Beach)లో ఓ అరుదైన వాతావరణ ఘటన సందర్శకుల‌కు భయాందోళన కలిగించింది. సముద్రపు కెరటం లానే కనిపించే ఓ భారీ మేఘం ఆకాశంలో పైపు ఆకారంలో తీరం వైపు వేగంగా కదులుతూ వచ్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని ‘రోల్ క్లౌడ్’(Roll Cloud) అంటారు. రోల్ క్లౌడ్ సమీపానికి వచ్చేసరికి బీచ్‌పై బలమైన గాలులు వీశాయి. దీంతో అక్కడున్న గొడుగులు, చిన్నచిన్న వస్తువులు ఎగిరిపోయాయి.

    Roll Cloud | ఇదేం వింత?

    పర్యాటకులు(Tourists) ఒక్కసారిగా షాక్‌కు గురై పరుగులు పెట్టారు. కొంతమంది స్థానికులు ఈ దృశ్యాన్ని ఫోన్‌లలో బంధించగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాతావరణ నిపుణుల వివరాల ప్రకారం, రోల్ క్లౌడ్ అంటే ఏంటి అంటే.. ఇది చాలా అరుదుగా కనిపించే వాతావరణ(Climate) మార్పు. ఇది సాధారణంగా వేడి గాలులు మరియు చల్లటి గాలులు పరస్పర ప్రభావంతో ఏర్పడుతుంది. ఇవి భూమికి సమాంతరంగా, పైపు మాదిరిగా చలనం కలిగి ఉండడం విశేషం. ఇవి భారీగా కనిపించినా సునామీ(Tsunami)తో ఎలాంటి సంబంధం ఉండదు.

    READ ALSO  Donald Trump | ఇండియా- పాక్ యుద్ధం ఆపింది నేనే.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట

    ప్రస్తుతం పోర్చుగల్‌(Portugal)లో తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు విస్తరిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన అస్థిర పరిస్థితులే ఈ రోల్ క్లౌడ్‌కు కారణమని ‘యూరోన్యూస్’(Euronews) నివేదిక పేర్కొంది. దీంతో పాటు, వడగాలులతో అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రమాదం పెరిగిందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, పర్యాటకులు ప్రత్యక్షంగా చూసిన ఈ వింత వాతావరణాన్ని జీవితంలో మరిచిపోలేనని చెబుతున్నారు.

    Latest articles

    Pashamylaram | ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాశమైలారం ప్రమాదం.. ఎమ్మెల్సీ కవిత విమర్శలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Pashamylaram | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం(Congress government negligence) వల్లే పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం...

    Doctor’s Day | ఘనంగా వైద్యుల దినోత్సవం

    అక్షరటుడే, ఇందూరు: Doctor's Day | రోటరీ క్లబ్ నిజామాబాద్ (Rotary Club Nizamabad) ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్స్...

    Bombay High Court | ప్రేమిస్తున్నానని చెప్పడం భావ వ్యక్తీకరణ మాత్రమే.. లైంగిక వేధింపుల కిందకు రాదన్న బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bombay High Court | ప్రేమిస్తున్నానని చెప్పడం కేవలం భావ వ్యక్తీకరణ మాత్రమేనని, అది లైంగిక...

    Central Cabinet | ఉపాధికి ఊతం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఆర్ డీఐకి రూ.లక్ష కోట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Central Cabinet | ప్రైవేట్ రంగంలో తయారీ, ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) మంగళవారం కీలక...

    More like this