More
    HomeసినిమాPeddi Movie | పెద్ది సినిమాలో స్పెష‌ల్ సాంగ్ కోసం ఆ బ్యూటీని ప‌ట్టుకొస్తున్నారా.. ఇక...

    Peddi Movie | పెద్ది సినిమాలో స్పెష‌ల్ సాంగ్ కోసం ఆ బ్యూటీని ప‌ట్టుకొస్తున్నారా.. ఇక జాతరే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddi Movie | ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బుచ్చిబాబు రామ్ చ‌ర‌ణ్‌ Ram Charan క‌లిసి పెద్ది అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన విష‌యాలు ప్రేక్ష‌కుల‌లో ఆసక్తిని క‌లిగిస్తున్నాయి. ఇటీవ‌ల చ‌ర‌ణ్ లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహ ఆవిష్కరణకు చరణ్ హాజరయ్యారు. ఆ ఈవెంట్​లో పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చారు. పెద్ది చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు 30% పూర్తయిందని రామ్ చరణ్ వెల్లడించారు. రంగస్థలం కంటే పెద్ది మూవీ భారీగా ఉంటుందని , మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన తర్వాత అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగిందని చెప్పారు.

    Peddi Movie | క్రేజీ న్యూస్..

    పెద్ది Peddi మూవీ కూడా రంగ‌స్థ‌లం తరహాలో ఉండబోతుందని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే చరణ్ ఇచ్చిన అప్డేట్​తో పెద్ది రంగస్థలం కంటే భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) హీరోయిన్​గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు లాంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత​ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​(Mythri Movie Makers)తో కలిసి వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుద‌లైన గ్లింప్స్​ కేక పుట్టించింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ సిక్స‌ర్ కొట్టిన తీరు అదుర్స్. ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.” అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పే డైలాగ్స్ ఈలలు వేయించేలా ఉన్నాయి

    READ ALSO  Naga Vamsi | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ చూశాక అంతా దాని గురించే చ‌ర్చ‌.. నిర్మాత స్ట‌న్నింగ్ కామెంట్స్

    వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కానుండ‌గా, ఇది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. చిత్రంలో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడని టాక్. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా Sports Drama ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంద‌ని అంటున్నారు. ఇక స్పెష‌ల్ సాంగ్ కూడా ప్లాన్ చేశార‌ని, ఆ సాంగ్ కోసం పూజా హెగ్డేని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లంలో పూజా స్పెష‌ల్ సాంగ్‌తో అద‌రగొట్టిన విష‌యం తెలిసిందే.

    Latest articles

    MP Arvind | పార్టీ మీటింగ్​కు హాజరు కాలేను.. ఎంపీ అర్వింద్​ ట్వీట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MP Arvind | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పార్టీలో కుంపటి రాజేసింది. బీజేపీ రాష్ట్ర...

    MLA Raja Singh | వాళ్లు పార్టీని నాశనం చేస్తున్నారు.. రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:MLA Raja Singh | రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్​(MLA Rajasingh) మరోసారి సంచలన వ్యాఖ్యలు...

    High Court | ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్​బండ్​పై ప్రదర్శించాలి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:High Court | రాష్ట్రంలో కొందరు అక్రమార్కులు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ...

    Krishna River | కృష్ణమ్మ గలగల.. గోదావరి వెలవెల

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Krishna River | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో కృష్ణానదిపై నిర్మించిన...

    More like this