అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagpur Railway Station | కదులుతున్న రైలులో ఎక్కడం ఎంతో ప్రమాదకరం. ఏ మాత్రం పట్టు తప్పిన ప్లాట్‌ఫామ్‌కు (Platform) రైలుకు మధ్యలో చిక్కుకు పోయి ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని (Maharashtra) నాగ్‌పూర్‌లో (Nagpur) ఓ యువతి కదులుతున్న రైలులో ఎక్కడానికి ప్రయత్నించి కింద పడిపోయింది. అక్కడే ఉన్న పోలీస్ వెంటనే స్పందించి ఆమె ప్రాణాలు కాపాడారు.
ఓ యువతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కదులుతున్న రైలులో ఎక్కడానికి యత్నించింది. ఈ క్రమంలో పట్టు తప్పి కింద పడిపోయింది. రైలుకు ప్లాట్‌ఫామ్‌కు మధ్యలోకి ఆమె పడిపోతుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీస్ ధీరజ్ దలాల్ (Railway policeman Dheeraj Dalal) ఆమెను బయటకు లాగి కాపాడారు. వేగంగా స్పందించి కాపాడిన పోలీసును నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.