అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Health Camp | పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని సీపీ సాయి చైతన్య (CP Sai chaitanya) సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో (Police Command Control Room) పోలీస్ శాఖ, ఫీనిక్స్ ఫౌండేషన్(Phoenix Foundation), శంకర కంటి ఆస్పత్రి (Shankara Eye Hospital) సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీపీ మాట్లాడుతూ.. విధుల్లో ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోవడంతో పలువురు సిబ్బంది రోగాల బారిన పడుతున్నారన్నారు.
ప్రతిఒక్కరూ ఆర్నెళ్ల కొకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. హెల్త్క్యాంప్లో సుమారు 450 మంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్ ips Sai kiran, అదనపు డీసీపీ (ఏఆర్) రామచందర్రావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, అడ్మిన్(ఏసీపీ) మస్తాన్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, సతీష్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ సరళ తదితరులు పాల్గొన్నారు.