అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | ఏ తల్లికి భారమో.. లేదా మరే తల్లి కర్కశత్వమో తెలియదు. కానీ.. అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన పడేశారు. బాహ్య ప్రపంచంలోకి రాగానే తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ శిశువు.. రోడ్డు పక్కన కనిపించింది. నవజాత శిశువును గమనించిన పోలీసులు ఆ పసికందును కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే.. బిచ్కుంద మండలం (Bichkunda mandal) పెద్ద దేవాడ గ్రామ శివారులోని బిచ్కుంద – బాన్సువాడ రోడ్డులో ఓ బ్రిడ్జి వద్ద నవజాత శిశువును రోడ్డు పక్కన పడేశారు. ఆ పసికందును గమనించిన బిచ్కుంద పోలీసులు (Bichkunda police) వెంటనే స్పందించి అక్కున చేర్చుకున్నారు. అనంతరం శిశువును పుల్కల్ పీహెచ్సీకి తరలించారు. ఆ తర్వాత బిడ్డకు మెరుగైన చికిత్స అందించేందుకు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడమైందని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. అలాగే సీడీపీవోకు సమాచారం ఇచ్చి.. శిశువు సంరక్షణార్థం వారికి అప్పగించినట్లు చెప్పారు.