అక్షరటుడే, వెబ్డెస్క్: కశ్మీర్‌లోని పహల్గామ్ ఘటన(Pahalgam terrorist attack)పై భారత ప్రధాని నరేంద్ర మోదీ(Pm modi) తొలిసారిగా స్పందించారు. బీహార్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడిన ఆయన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ‘ఏప్రిల్ 22న అమాయకులైన ప్రజల ప్రాణాలను ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. అమాయకుల ప్రాణాలను తీసుకుని వారు నరమేదం సృష్టించారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనిరీతిలో శిక్షిస్తాం. అలాగే ఉగ్రనేతలను సైతం కఠినంగా శిక్షిస్తాం. ఇందుకు నేను హామీ ఇస్తున్నా.. 140 కోట్ల మంది ప్రజల కోరిక తప్పకుండా నెరవేరుతుంది’ అని మోదీ తీవ్ర హెచ్చరికలు(Modi strong warning) జారీ చేశారు. ప్రత్యేకించి పాకిస్థాన్(Pakistan)ను ఉద్దేశించి మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
బీహార్‌లో గురువారం జరిగిన పంచాయతీరాజ్ సదస్సులో ఆయన పాల్గన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన పౌరులకు నివాళి అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ప్రసంగించారు. రూ.13,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వందేభారత్, అమృత్ భారత్ రైళ్లను వేదికపై నుంచి ప్రారంభించారు. ఉగ్రవాదులను భూస్థాపితం చేసే రోజులు దగ్గర పడ్డాయని, త్వరలో ప్రతీకార చర్య ఉంటుందని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇప్పటికే అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పీఎం మోదీ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికర చర్చకు దారితీసింది.