అక్షరటుడే, వెబ్డెస్క్:Prime Minister Modi | ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన modi russia tour రద్దయ్యింది. ఈ మేరకు బుధవారం అధికారిక సమాచారం అందింది.
మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద ‘గ్రేట్ పేట్రియాటిక్ వార్’ (Great Patriotic War) వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోదీ(Narendra Modi) పాల్గొనాల్సి ఉంది. అయితే తమ దేశ విక్టరీ డేకు మోదీ హాజరుకావడం లేదని రష్యా(Russia) వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్ – పాక్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని రష్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.