అక్షరటుడే, వెబ్‌డెస్క్: Plane Crash : లండన్ (London) నగరంలో ఘోర విమాన ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సౌత్ ఎండ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఒక బీచ్ క్రాఫ్ట్ బీ200 సూపర్ కింగ్ ఎయిర్ మినీ జెట్ విమానం (Beechcraft B200 Super King Air mini jet plane) కుప్పకూలిపోయింది.
విమానం నేలపై పడిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గురైన విమానం మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ జెట్ (medical transport jet) అని తెలుస్తోంది. ఇందులో సాధారణంగా పేషెంట్లు, వైద్య సిబ్బంది ప్రయాణిస్తారు. అయితే, ప్రమాద సమయంలో ఎంత మంది ఉన్నారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Plane Crash : పేలిన విమానం..
విమానం లండన్ London నుంచి నెదర్లాండ్ Netherland దిశగా బయలుదేరింది. కానీ, ఎయిర్‌పోర్ట్‌కు కొద్దిగా దూరంలోనే కుప్పకూలిపోయింది. విమానం కూలిన తీరును చూపిస్తూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో పెద్ద ఎత్తున మంటలు, పొగ గాలిలోకి ఎగసిపడుతున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. ప్రమాదం అనంతరం సౌత్ ఎండ్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాల రాకపోకలు రద్దు అయ్యాయి. స్థానిక అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. టెక్నికల్ లోపమా? మానవ తప్పిదమా? అనేదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
గత నెల 12వ తేదీన భారత్‌కు చెందిన ఏఐ 171 విమానం కూడా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ (Ahmedabad)లో ఓ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు.
విమానానికి Flight ఇంధన సరఫరా నిలిపివేయబడటం వల్లే ప్రమాదం సంభవించినట్టు దర్యాప్తులో తేలింది. ఇంత పెద్ద ప్రమాదంలో ఒకే ఒక్కడు బతికి బయటపడటం అందరిని ఆశ్చర్యపరిచింది.
అయితే, లండన్ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సి ఉంది. విమాన ప్రమాదాల పరంపర ఇప్పటికే ప్రజల్లో భయాందోళనకు కారణమవుతోంది. ప్రయాణ భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.