అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delta Airlines | మరో విమానంలో మంటలు చెలరేగాయి. గాలిలో ఉండగా విమానం ఇంజిన్‌లో మంటలు అంటుకోవడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) చేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
డెల్టా ఎయిర్ లైన్స్ (Delta Airlines) కు సంబంధించిన లాస్ఎంజెలిస్ నుంచి అట్లాంటాకు బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. విమాన సిబ్బంది వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రన్‌వేపై మంటలను ఆర్పారు.
Delta Airlines | భయపెట్టిస్తున్న బోయింగ్
బోయింగ్ విమానాలు (Boeing Planes) ప్రయాణికులను భయ పెట్టిస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్ విమానం కూలిపోయి 270 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 767-400 ఫ్లైట్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే మంటలు చెలరేగడం.. పైలెట్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
కాగా ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విమానం దాదాపు 25 ఏళ్ల క్రితం నాటింది.
HORRORS OF BOEING CONTINUE
Delta Airlines Boeing 767 makes emergency landing after engine BURSTS INTO FLAMES mid-air!
Plane turned back to LAX minutes after takeoff, headed to Atlanta.
Passengers share scary moments, but all safe.#Boeing #boeing767 pic.twitter.com/Oe1k69RlgL
— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) July 20, 2025