More
    HomeతెలంగాణHyderabad | ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడిన ప్రజలు.. అడ్డుకున్న అనుచరులపై దాడి

    Hyderabad | ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడిన ప్రజలు.. అడ్డుకున్న అనుచరులపై దాడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | వానాకాలం వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad city)​ నగరంలో పలు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తారు. చిన్నపాటి వర్షం పడినా నగరంలోని చాలా కాలనీలు నీట మునుగుతాయి. వరద నీరు సాఫీగా వెళ్లే మార్గం లేక ఈ సమస్య ఏటా తలెత్తుతూనే ఉంది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.

    ఏళ్లుగా తమ కాలనీలో నాలా సమస్యతో ఇబ్బంది పడుతున్నామని చెప్పినా పట్టించుకోవడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే(MIM MLA)పై శుక్రవారం ప్రజలు తిరగబడ్డారు. ఈ క్రమంలో కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్​ నగరంలోని యాకుత్‌పుర (Yakutpura) పరిధిలో నాలా సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు విన్నవించినా నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్​ హుస్సేన్ (Nampally MLA Jafar Hussain)​ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.

    READ ALSO  Today Gold Price | త‌గ్గిన బంగారం.. పెరిగిన వెండి ధ‌ర.. ఈ రోజు ఎంతంటే..!

    Hyderabad | పరిశీలన కోసం వెళ్తే..

    కాగా.. గురువారం కురిసిన వర్షానికి నాలా సమీపంలోని ఇళ్లలోకి వరద వచ్చింది. దీంతో పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఆయనపై తిరగబడ్డారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు చితకబాదారు. వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడం లేదని, దీంతో ఇబ్బంది పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    Latest articles

    MBBS Seat | ఎంబీబీఎస్​లో సీటు సాధించిన విద్యార్థికి అభినందన

    అక్షరటుడే, కోటగిరి: MBBS Seat | మండల కేంద్రానికి చెందిన విద్యార్థి నిఖిత ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షల్లో...

    Kamareddy | గంజ్‌ గేటు వద్ద గుంత.. వాహనదారులకు చింత

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని గంజ్‌ రెండో గేటు వద్ద ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు...

    Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో రూ.50 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో హైదరాబాద్ (Hyderabad)​కు చెందిన ఓ యువకుడు రూ.50...

    Bheemgal | ఎస్సై కొట్టాడంటూ.. సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bheemgal | భీమ్​గల్​ ఎస్సై, కానిస్టేబుళ్లు తనను కొట్టారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రం కేంద్రంలోని...

    More like this