More
    HomeతెలంగాణLocal Body Elections | స్థానిక ఎన్నికలపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) షెడ్యూల్​ త్వరలో వెలువడుతుందని ఇటీవల పలువురు మంత్రులు ప్రకటన చేశారు. నెలాఖరులో షెడ్యూల్​ విడుదల చేసి వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. దీంతో పల్లెల్లో ఆశావహులు, నాయకులు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్ (PCC Chief Mahesh Goud)​ కీలక వ్యాఖ్యలు చేశారు.

    Local Body Elections | ఇంకా నిర్ణయం జరగలేదు

    మహేశ్​గౌడ్​ ఆదివారం నిజామాబాద్​ (Nizamabad)లో మాట్లాడారు. స్థానిక ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని ఆయన తెలిపారు. మంత్రివర్గంలో (Cabinet) చర్చించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఈ నెల 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే స్థానిక ఎన్నికలపై చర్చించి ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్​ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.

    READ ALSO  Local Body Elections | స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. అప్పటిలోగా ఎలక్షన్లు నిర్వహించాలని ఆదేశాలు

    Local Body Elections | రేపు మంత్రివర్గ సమావేశం

    సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​ (Banakacharla Project)పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి జలాలను అక్రమంగా తరలిస్తే ఊరుకోమని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే బనకచర్లకు అనుమతి ఇవ్వొద్దని ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. అయితే సోమవారం నిర్వహించే కేబినెట్​ మీటింగ్​లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

    Local Body Elections | రిజర్వేషన్లపై స్పష్టత కరువు

    కాంగ్రెస్​ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కులగణన చేసి బీసీ రిజర్వేషన్ల (BC Reservations) బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది. ఆ బిల్లులను కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం నుంచి వాటికి ఇంకా అనుమతులు రాలేదు. దీంతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

    READ ALSO  local body elections | స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు

    ఇప్పటికే పంచాయతీలకు 16 నెలలుగా పాలకవర్గాలు లేవు. ఇన్​ఛార్జీల పాలనతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం అయిపోయి కూడా ఏడాది కావొస్తోంది. దీంతో ఎన్నికల కోసం ఆయా పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నిరీక్షిస్తున్నారు. ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు పెడతారా అని చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. తాజాగా పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

    Latest articles

    ACB Case | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పట్టడమే...

    Honor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Honor X9c 5G | భారత మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్ మరోసారి తన దూకుడు...

    Subhansh Shukla | జీరో గ్రావిటీలో న‌డ‌క నేర్చుకుంటున్నా.. భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Subhansh Shukla | అంత‌రిత‌క్ష ప్ర‌యాణంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదిస్తున్నాన‌ని భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డించారు....

    Bangalore House Rents | బెంగ‌ళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bangalore House Rents | మ‌న తెలుగు వారు సిలికాన్ సిటీ బెంగ‌ళూరుకి (Bangalore) ఉద్యోగాల కోసం...

    More like this

    ACB Case | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Case | రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పట్టడమే...

    Honor X9c 5G | 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో మిడ్-రేంజ్‌లో సెన్సేషన్.. ధర, ఫీచర్లు ఇవే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Honor X9c 5G | భారత మార్కెట్‌లో హానర్ స్మార్ట్ ఫోన్ మరోసారి తన దూకుడు...

    Subhansh Shukla | జీరో గ్రావిటీలో న‌డ‌క నేర్చుకుంటున్నా.. భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Subhansh Shukla | అంత‌రిత‌క్ష ప్ర‌యాణంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదిస్తున్నాన‌ని భార‌త వ్యోమ‌గామి శుభాన్ష్ శుక్లా వెల్ల‌డించారు....