అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Pawan Kalyan | జూన్ 1న సినిమా థియేటర్స్ బంద్(Cinema theaters bandh) ప్రకటిస్తానని చెప్పడంతో ఈ వ్యవహారం ప్రకంపనలు పుట్టించింది. దీనిపై ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించగా.. నిర్మాతలు అల్లు అరవింద్, Allu Aravind దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహరం చర్చనీయాంశంగా మారిన తరుణంలో దీనిపై పవన్ మరోసారి స్పందించారు. కొత్త చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
Pawan Kalyan | ఎవరిని వదలొద్దు..
సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనల నేపథ్యంలో సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh).. తన శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను పవన్ కళ్యాణ్‌కు వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ Pawan Kalyan పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ సహా సినిమాలకు సంబంధించి ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమాకు కూడా టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ఏపీ ప్రభుత్వానికి అర్జీ ఇవ్వాలని, ఆ విధంగానే సంప్రదింపులు చేయాలని స్పష్టం చేశారు. ఇందులో తనమన బేధాలకు తావులేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
టికెట్ ధర(Ticket price) కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఇంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. ప్రేక్షకులు సినిమా థియేటర్(Cinema theater)కి వచ్చేందుకు వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి Deputy CM అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్యా పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకొంటాయన్నారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. కోణంలో కూడా విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు.