అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Harihara Veeramallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూలై 24న రిలీజ్ కానుంది. ఇక ట్రైలర్(Trailer)ను జులై 3వ తేదీ ఉదయం 11:10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.. అయితే ట్రైలర్‌ని ఈ సారి యూట్యూబ్‌లో కాకుండా వినూత్నంగా 29 థియేటర్లలో థియేట్రికల్ రిలీజ్(Theatrical Release) ద్వారా ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, చిత్తూరు వంటి ప్రధాన నగరాల్లో అభిమానులు థియేటర్లకు వెళ్లి ట్రైలర్‌ను పెద్ద తెరపై చూసే అదృష్టం పొందనున్నారు.
Harihara Veeramallu | పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా..
ఇప్పటికే అభిమానులు థియేటర్ల వద్ద కట్ అవుట్లు, ఫ్లెక్సీలు, డీజేలు, బాణాసంచా వంటివి ఏర్పాటు చేస్తూ సినిమాకు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. జులై 3న ఆ రోజంతా థియేటర్ల వద్ద పవన్ హవా కొనసాగనుంది. ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతుండడంతో, ట్రైలర్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశముంది. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ప్రత్యేక అనుభవాన్ని మిస్ అవ్వకుండా థియేటర్లలోనే ట్రైలర్‌ను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక మరి కొద్ది గంటలలో విడుదల కానున్న ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ చిత్ర బృందంతో కలిసి చూశారు. ట్రైలర్ పవన్‌కు నచ్చడంతో ప్రత్యేకంగా టీమ్‌ని అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్‌గా రానున్నారని టాక్ నడుస్తోంది. ఇక పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే ధీరోదాత్తమైన యోధుడి పాత్రలో కనిపించనుండడంతో మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది. ట్రైలర్ ఈవెంట్‌లో చిరంజీవి పాల్గొంటే మూవీకి మరింత బూస్టప్ రావడం ఖాయం.