అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | జిల్లా యువజన క్రీడల అధికారిగా బి.పవన్ (B. Pawan) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న ముత్తెన్న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో పవన్ నియమితులయ్యారు.
Nizamabad City | జాతీయస్థాయికి..
జిల్లా యువజన క్రీడల అధికారి (District Youth Sports Officer) శిక్షణలో పలువురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదిగారు. వాలీబాల్ క్రీడాకారుడిగా, పీడీగా జిల్లా క్రీడా రంగానికి పవన్ సుపరిచితులు. ప్రస్తుతం జక్రాన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో (Jakranpally Zilla Parishad School) ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పదవీ విరమణ పొందారు. ఆయన శిక్షణలో ఎందరో క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారు. పలువురు క్రీడాకోటలో ఉద్యోగాలు సైతం పొందారు.