ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Railway Passengers | ఆ మార్గంలో తొలిసారి కూతపెట్టనున్న ప్రయాణికుల రైలు.. ఎక్కడో తెలుసా..!

    Railway Passengers | ఆ మార్గంలో తొలిసారి కూతపెట్టనున్న ప్రయాణికుల రైలు.. ఎక్కడో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Railway Passengers | ఏళ్ల క్రితం నిర్మించిన ఆ రైల్వే మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు కూత పెట్టనుంది. తమ చెంతనే రైల్వే మార్గం ఉన్నా.. రైలు ఎక్కే భాగ్యం లేక ప్రజలు ఇన్ని రోజులు ఇబ్బందులు పడేవారు. తాజాగా రైల్వేశాఖ (Railway Department) ప్రయాణికుల రైలు నడపడానికి ఆమోదం తెలపడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతిలోని (Amaravati) నడికుడి నుంచి శ్రీకాళహస్తి (Srikalahasti) వరకు రైల్వేలైన్​ ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే ఈ మార్గంలో కేవలం గూడ్స్​ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్రయాణికుల రైళ్ల నడపాలని ఆయా గ్రామాల ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రైల్వేశాఖ వీక్లీ ఎక్స్​ప్రెస్​ (weekly express) నడపడానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

    READ ALSO  Eagle System | రైళ్లలో గంజాయి తరలింపు.. భారీగా స్వాధీనం చేసుకున్న ఈగల్​ టీం

    Railway Passengers | ప్రతి శుక్రవారం

    శ్రీకాళహస్తి – నడికుడి రైల్వే మార్గంలో (Srikalahasti – Nadikudi railway line) ఈనెల 4న తొలి రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నెమలపురి, రోంపిచర్ల రైల్వే స్టేషన్లలో టికెట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారం ఈ రైలు నడుస్తుందని వారు పేర్కొన్నారు. జులై 4 నుంచి 25 వరకు ప్రతి శుక్రవారం ఈ రైలు మహారాష్ట్రలోని నాందేడ్​ నుంచి బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు తిరుపతిలో జులై 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరుతోంది. వినుకొండకు రాత్రి 10.05కు, రొంపిచర్ల 10.25కు, నెమలిపురి 10.35కు, పిడుగురాళ్ల 10.45కు, నడికుడి 11.00కు, నాందేడ్‌కు ఆదివారం ఉదయం 09.30 గంటలకు చేరుకుంటుంది.

    READ ALSO  Srisailam Project | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

    Latest articles

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    Karnataka | క‌ర్ణాట‌కలో మ‌ళ్లీ మొద‌టికొచ్చిన వివాదం.. నాయ‌క‌త్వాన్ని మార్చాల‌న్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ అంశం దుమారం రేపుతూనే ఉంది. ఐదేళ్లూ ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని...

    Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhadrachalam Temple | దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. కొందరు ఆలయ భూములను యథేచ్ఛగా...

    More like this