అక్షరటుడే, వెబ్డెస్క్ : Parliament sessions | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహించనుంది. జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Union Minister Kiren Rijiju) ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. సెలవు దినాల్లో సమావేశాలు ఉండవు. దీనికి తోడు స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో కూడా సమావేశాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Parliament sessions | కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం
జమ్మూ కశ్మీర్లోని (Jammu and Kashmir) పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి (terrorists attacked) చేశారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack), ఆపరేషన్ సిందూర్ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో వాటిపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
భారత్, పాక్ (India – Pakistan) మధ్య తాను యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిని సభలో లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad plane crash) గురించి కూడా సభలో చర్చించే ఛాన్స్ ఉంది.
Parliament sessions | బీసీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదిస్తారా..
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ప్రకటించింది. ఈ మేరకు స్థానిక ఎనికలతో (local elections) పాటు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించింది. వీటిని కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదిస్తేనే ఈ బిల్లులు చట్టం రూపం దాల్చనున్నాయి. వర్షాకాల సమావేశంలో ఈ బిల్లులను ఆమోదిస్తే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు (BC reservations) అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 30లోపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను కేంద్రం ఆమోదిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.