అక్షరటుడే, వెబ్‌డెస్క్: Parents : ఆడుతూ పాడుతూ సరదాగా గడిపే వయసులో ఆ బాలిక పోలీస్ స్టేషన్ police station మెట్లెక్కింది. తోటి వారందరూ వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటే.. తను మాత్రం అమ్మ అనురాగం, నాన్న ప్రేమ కోసం ఖాకీల పంచన చేరింది.
కన్నపేగును వదిలేసుకున్న తల్లిదండ్రుల కోసం కన్నీరు కారుస్తోంది. అమ్మానాన్నలే తనను వద్దంటే నా బతుకేంకానంటూ ఆ ఎనిమిదో తరగతి విద్యార్థిని 8th class student కన్నీరుమున్నీరవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు..
విశాఖపట్నాని(Visakhapatnam)కి చెందిన వ్యక్తికి, అనకాపల్లి(Anakapalle)కి చెందిన మహిళకు పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి తండ్రి దగ్గర ఉంటోంది.
కాగా, తల్లిదండ్రులు తనను పట్టించుకోవడం లేదంటూ బాలిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లిదండ్రులను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే, కుమార్తెను తమతో తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇష్టపడకపోవడంతో పోలీసులు విస్తుపోయారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చివరికి బాలిక బాధ్యతను ఆమె తాతకు అప్పగించారు పోలీసులు.