అక్షరటుడే, ఇందూరు:Parents Meeting | బోర్గాం(పి)లోని జెడ్పీ ఉన్నత పాఠశాల(Borgaon ZP High School)లో బుధవారం పేరెంట్(Parent), టీచర్ మీటింగ్(Teacher Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం శంకర్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరంలో విద్యార్థుల(Students improvement) ప్రగతికి చేపట్టిన కార్యక్రమాలు, ఇతర అంశాలను వివరించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులపై శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులకు సూచించారు. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలో ప్రవేశాల students admission సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏఏపీసీ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
