అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistani Minister | పహల్గామ్ దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ (India and Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Pakistan Defense Minister Khawaja Asif) మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్‌పై దాడి చేయడానికి ధైర్యం చేస్తే ఎవరూ మనుగడ సాధించలేరని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉనికికి ముప్పు వస్తే ఈ ప్రపంచంలో ఎవరూ మనుగడ సాగించలేరని నోరుపారేసుకున్నారు. “భారతదేశం (india) పాకిస్తాన్‌పై దాడి చేయడానికి ధైర్యం చేస్తే, అది పాకిస్తాన్ ఉనికికి ముప్పు తెస్తే, ఈ ప్రపంచంలో ఎవరూ మనుగడ సాగించలేరు” అని మంత్రి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత పరిస్థితిని గాజాలో (gaza) ఇజ్రాయిల్ సైనిక దాడితో ఆసిఫ్ పోల్చారు. ఇజ్రాయిల్ కూడా ఇదే తరహాలో యుద్ధం (war) చేస్తోందన్నారు. అయితే మనం బతుకుతాము, లేకపోతే ఎవరూ బతుకరన్న ఉద్దేశంతో దాడి జరుగుతోందన్నారు. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో (Israeli Prime Minister Benjamin Netanyahu) పాటు మిత్రదేశాలు కూడా అదే మనస్తత్వాన్ని ప్రయోగిస్తున్నాయని అన్నారు.