అక్షరటుడే, వెబ్‌డెస్క్: ISI Chief | పహల్గామ్‌లో ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు తలెత్తాయి. 26 మంది అమాయక ప్రాణాలను బలిగొన్న ఈ దాడి తర్వాత దాయాదిలో తీవ్ర భయం మొదలైంది. ఎప్పుడు ఎక్కడి నుంచి భారత్(India) దాడి చేస్తుందోనన్న భయంతో వణికిపోతున్న పాక్(Pakistan).. అంతర్గత భద్రతపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆర్మీ చీఫ్ మాలిక్(Army Chief Malik) అజ్ఞాతవాసంలోకి వెళ్లగా, వేలాది మంది సైనికులు రాజీనామాలు చేస్తుండడంతో షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్(Muhammad Asim Malik)ను జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా నియమించింది. ఐఎస్ఐ చీఫ్(ISI Chief )గా నియమించిన ఆర్నెళ్లకే మాలిక్‌కు అదనంగా మరో కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
ISI Chief | భయాందోళనలో పాక్..
భారత్(India)తో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ పాకిస్తాన్(Pakistan) తీవ్ర ఆందోళన చెందుతోంది. పైకి గంభీర ప్రకటనలు చేస్తున్నప్పటికీ అంతర్గతంగా భయపడుతోంది. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఏ విధంగా స్పందిస్తుందోన్న ఆందోళనలో ఉన్న పాకిస్తాన్‌కు ఆర్మీ(Army) నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదు. ఇప్పటికే ప్రాణభయంతో వేలాది మంది సైనికులు స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్మీలో విశ్వాసం నింపడానికి తాజాగా ఐఎస్ఐ చీఫ్(ISI chief)ను భద్రతా సలహాదారుగా నియమించినట్లు చెబుతున్నారు.
ISI Chief | ఇదే తొలిసారి..
ఐఎస్ఐ చీఫ్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు మాలిక్(Asif Munir Malik) అత్యంత సన్నిహితుడు. వ్యూహాత్మక ఎత్తుగడల్లో అతడికి మంచి ప్రావీణ్యం ఉందని చెబుతారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు(Imran Khan Arrest), ఈ సందర్భంగా వెల్లువెత్తిన ఆందోళనలను అణచి వేయడంలో మాలిక్ కీలకంగా వ్యవహరించారు. బలూచిస్తాన్‌లో పని చేసిన అనుభవం ఆయన సొంతం.