అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pahalgaon terror attack : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బైసరన్ వ్యాలీ Baisaran Valley కి టూరిస్టుగా వచ్చిన అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి, తనకు తెలికుండానే ఉగ్రదాడి ఘటనను వీడియోలో రికార్డు చేశాడు.
జిప్‌లైన్ zipline పై రైడ్ చేస్తున్నప్పుడు పర్యాటకుడు సెల్ఫీ వీడియో selfie video తీసుకున్నాడు. అయితే, అందులో ఉగ్రదాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. జిప్‌లైన్‌పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుంటే.. అదే సమయంలో కింద ఉన్న పర్యాటకుల కేకలు, ఉగ్రవాదుల తుపాకీ శబ్దాలు అందులో రికార్డయ్యాయి.
ఉగ్రదాడిలో ఓ వ్యక్తి నేలకొరిగిన దృశ్యం ఆ వీడియోలో కనిపించింది. కానీ, దిగువన జరుగుతున్న విషయాలేవీ సదరు పర్యాటకుడు గుర్తించలేదు. తన చెవులు కప్పి ఉంచడం వల్ల వినిపించకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
One more video of Pahalgam attack
Heartbreaking to watch pic.twitter.com/LHIkily5dP
— War & Gore (@Goreunit) April 28, 2025