అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడిలో terrorist attack 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం union government అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ rajnath singh అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా amit shah, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా jp Nadda, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, ఆయా పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఉగ్రదాడి అనంతరం తీసుకున్న చర్యల గురించి ఈ సమావేశంలో ప్రభుత్వం వివరించనుంది. దాడి జరిగిన తీరు, ప్రభుత్వ స్పందన, పాక్‌తో ఒప్పందాల రద్దు గురించి చర్చించనున్నారు. మున్ముందు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఈ మీటింగ్‌లో చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వివరించారు.