అక్షరటుడే, న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారం పొందారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కొనసాగింది. ఈ వేడుకకు అశ్విన్ భార్య, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం వేళ అశ్విన్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం ప్రకటించింది. భారత క్రికెట్ జట్టుకు అశ్విన్ అందించిన సేవలకుగాను పద్మ అవార్డుతో కేంద్రం సత్కరించింది.
అశ్విన్ 2010లో అంతర్జాతీయ టీ20తో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14 ఏళ్ల కెరీర్లో అశ్విన్ టీమిండియా అనేక విజయాలు అందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో పలు రికార్డులు లిఖించాడు. టెస్టుల్లో 537 వికెట్లు తీసుకొని, 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. గతేడాది ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌తో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నాడు.
Padma Awards ceremony : భారత అథ్లెట్..
భారత అథ్లెట్, టీమిండియా మాజీ హాకీ ప్లేయర్, ఒలింపిక్ మెడలిస్ట్ పీఆర్ శ్రీజేశ్ Indian athlete, former Team India hockey player, and Olympic medalist PR Sreejesh పద్మ భూషణ్ అవార్డు Padma Bhushan award అందుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో శ్రీజేశ్కు ద్రౌపదీ ముర్ము పురస్కారం అందజేశారు. ఈ వేడుకకు శ్రీజేశ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శ్రీజేశ్ సంప్రదాయ దుస్తులైన పంచకట్టుతో ఈ ఈవెంట్‌కు వచ్చారు.