అక్షరటుడే, ఇందూరు: Outsourcing employees | వెల్‌నెస్ సెంటర్లలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు (JAC leaders) డిమాండ్ చేశారు.
Outsourcing employees | వెల్నెల్ సెంటర్లో నిరసన
ఈ సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్, తెలంగాణ వెల్నెస్ సెంటర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (Telangana Wellness Centers Employees Association) ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. నగరంలోని వెల్నెస్ సెంటర్లో శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపామన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహాధర్నాకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని, లేదా ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు.
Outsourcing employees | విధినిర్వహణలో భాగంగా మరణిస్తే..
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్, హెల్త్ ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్, తెలంగాణ వెల్‌నెస్ కేంద్రాల ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు, వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు(data entry operators), సిబ్బంది పాల్గొన్నారు.