అక్షరటుడే, వెబ్డెస్క్: దంచికొడుతున్న ఎండలు, ఉక్కపోతతో భారత్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు(temperatures) అధికంగా నమోదవుతున్నాయి. అనేక చోట్ల 44 డిగ్రీల కంటే ఎక్కువగా రికార్డవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ(ఐంఎడీ) పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి తీవ్రతను వివరిస్తూ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత( మరింత ఎక్కువగా ఉండే ప్రమాదముందని తెలిపింది. ఇప్పటికే ఉక్కపోతలతో అల్లాడిపోతున్న జనాలకు ఐఎండీ(IMD) తాజా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తోంది.
Summer | తెలంగాణకు అలర్ట్
తెలంగాణ(Telangnana)లో అత్యధిక ఉష్ణోగ్రతలు(High temperature) నమోదవుతున్న తరుణంలో ఐఎండీ(IMD) ఆరెంజ్ అలర్ట్(Orange alert) జారీ చేసింది. ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల సహా పలు జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్‌లో అత్యధికంగా 44.5°C నమోదైంది. ఉత్తర-దక్షిణ ద్రోణి సాధారణ వాతావరణ వ్యవస్థలకు అంతరాయం కలుగడం వల్ల ఎండలు తీవ్రంగా ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Summer | ఉత్తరంలోనూ ఉక్కపోతలు
ఎండ వేడిమి తెలంగాణ(Telangnana)కే పరిమితం కాలేదు. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఉడుకుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు హీట్ అలర్ట్‌లలో ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43°C కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఢిల్లీలోని ఎన్‌సీఆర్ ప్రాంతంలో యెల్లో అలర్ట్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని ప్రాంతాలు ఆరెంజ్ అలర్ట్(Orange alert) జారీ చేశారు. ఈ వారమంతా వేడిగాలుల పరిస్థితులు కొనసాగుతాయని, వారాంతం నాటికి కొన్ని ప్రాంతాలలో స్వల్ప ఉపశమనం లభించే అవకాశం ఉందని ఐఎండీ(IMD) అంచనా వేసింది.