అక్షరటుడే, హైదరాబాద్: Temperatures : తెలంగాణ రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. 45 డిగ్రీలకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో నేడు ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలు ఇందులో ఉన్నాయి. ఈ జిల్లాల్లో సాధారణానికి మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.