More
    HomeజాతీయంOperation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్ టైటిల్‌తో పోస్ట‌ర్ విడుద‌ల‌.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

    Operation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్ టైటిల్‌తో పోస్ట‌ర్ విడుద‌ల‌.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Operation Sindoor | ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి(Pahalgam Terror Attack)లో 26 మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం ఆపరేషన్ సిందూర్ Operation sindoor పేరుతో పాకిస్తాన్‌‌పై క్షిపణి దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే 1.44 గంటలకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్‌(Pakistan)తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్‌ క్షిపణులతో విరుచుకుప‌డ‌డంతో పాక్ ఉలిక్కిప‌డింది. ప్ర‌స్తుతం ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో బాలీవుడ్ (Bollywood) అంతా ఆపరేషన్ సిందూర్ టైటిల్‌పై ఫోక‌స్ చేయ‌డం అందరిని ఆశ్చర్య‌ప‌రిచింది.

    Operation Sindoor | క్రేజీ పోస్ట‌ర్..

    ఒక వైపు యుద్ధం కోసం సైన్యం అంత‌గా పోరాడుతుంటే టైటిల్ కోసం ఏకంగా 15 స్టూడియోల మధ్య యుద్ధం జరుగుతుండటం ఆశ్చర్యకరంగా మారింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనే పదం ఇప్పుడు బాగా వైరల్ కావ‌డంతో, అందరి నోళ్లలో ఇది నానుతోంది. దీంతో ఈ టైటిల్‌ను దక్కించుకునేందుకు బాలీవుడ్ మేకర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదే స‌మ‌యంలో ఒక ఫిలిం మేకర్ Film Maker సినిమా ప్రకటన కూడా చేసేశారు, పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు మేకర్స్ పై విరుచుకుపడ్డారు. విరల్ భయాని(Viral Bhayani) అనే పేజీలో ఈ సినిమా పోస్టర్ షేర్ చేయ‌గా, పోస్టర్ లో ‘ఆపరేషన్ సింధూర్’ అనే టైటిల్ పైన ‘భారత్ మాతా కీ జై’ అని రాసి ఉంది. టైటిల్ కింద ఆర్మీ యూనిఫామ్ లో ఒక నటి చేతిలో గన్ పట్టుకుని, నుదుటన సింధూరం పెట్టుకుంటున్నట్టు చూపించ‌డం జ‌రిగింది.

    READ ALSO  Pakistan Defense Minister | ఇండియా నిఘా స‌మాచారం ఇచ్చింది చైనాయే.. పాకిస్తాన్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ వెల్ల‌డి

    ఇక బ్యాక్ గ్రౌండ్ లో Back ground బాంబు దాడుల సీన్ ఉంది. “ఇండియా చేసిన ధైర్య సాహసాలతో కూడిన ‘ఆపరేషన్ సిందూర్’ సినిమా కోసం నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్(Nicky Vicky Bhagnani Films), ది కంటెంట్ ఇంజనీర్ కలిసి పనిచేస్తున్నారు” అని పోస్టర్ షేర్ చేస్తూ రాశారు. ఉత్తమ్ మహేశ్వరి, నితిన్ కుమార్ గుప్తా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నటీనటుల గురించి ఇంకా సమాచారం లేదు. యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలో జ‌వాన్ల‌కి అండ‌గా ఉంటూ ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి డ‌బ్బుల కోసం ఇలాంటి ప‌నులు చేస్తారా అని కొంద‌రు తిట్టిపోస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

    Latest articles

    Minister seethakka | జిల్లాకు విచ్చేసిన ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల

    అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రి నియమితులైన సీతక్క (Minister Seethakka) మొదటిసారిగా జిల్లాకు...

    Hydraa | పార్క్​లో అక్రమ నిర్మాణలను కూల్చేసిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే...

    BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నికకు...

    Pawan Kalyan | పవన్ అన్నా మా బిడ్డ కనిపించడం లేదంటూ ప్ల‌క్కార్డులు. 48 గంటల్లో పరిష్కారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | సుమారు 18 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా (Kakinada...

    More like this

    Minister seethakka | జిల్లాకు విచ్చేసిన ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల

    అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రి నియమితులైన సీతక్క (Minister Seethakka) మొదటిసారిగా జిల్లాకు...

    Hydraa | పార్క్​లో అక్రమ నిర్మాణలను కూల్చేసిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే...

    BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నికకు...