అక్షరటుడే, వెబ్‌డెస్క్:Operation Sindoor | భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)తో పాక్ వెన్నులో భయం పుట్టింది. తమ దేశంలోకి చొచ్చుకొచ్చి మరి ఉగ్రవాద శిబిరాలను భారత్(India) ధ్వంసం చేయడంతో ఆ దేశంలో ఆందోళన నెలకొంది. తాము ప్రతిదాడి చేస్తే భారత్ మరింత పెద్ద దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ నేతలు(Pakistan Leaders) భయపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్‌కు ప్రతి దాడి తప్పదని పలువురు నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఆర్మీ అధికారుల్లో కూడా భయం ఉంది. ఈ క్రమంలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్(Pakistan Defense Minister Khawaja Asif) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడులు ఆపేస్తే తాము ప్రతి చేయమని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ మళ్లీ దాడులు చేయకపోతే తాము ప్రతీకారానికి దిగమని ఆయన ప్రకటించారు.
Operation Sindoor | భయాందోళనలో ప్రజలు
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ భయంతో ఆ దేశస్తులు బ్యాంకులు(Banks), ఏటీఎం(ATM)ల ముందు బారులు తీరారు. డబ్బులు డ్రా చేసుకొని ఎక్కువ మొత్తంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి యత్నిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడానికి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) ఎఫెక్ట్‌తో పాక్ స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. దాదాపు 6 శాతం మేర సూచీలు పడిపోయాయి.