అక్షరటుడే, ఆర్మూర్: Babli Gates | బాబ్లీ గేట్లు మంగళవారం తెరుచుకున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల అధికారులు కలిసి గేట్ల ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచారు. దీంతో ప్రాజెక్ట్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది.
Babli Gates | నాలుగునెలల పాటు..
బాబ్లీ ప్రాజెక్టు గేట్లను వర్షాకాలం సీజన్లో నాలుగు నెలల పాటు తెరిచి ఉంచాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం జూలై 1 నుంచి అక్టోబరు 28 వరకు గేట్లను తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత ప్రాజెక్టు గేట్లను మూసివేస్తారు. మహారాష్ట్రలో కురిసే వర్షాలకు అనుగుణంగా ఈ నాలుగు నెలలు ఎస్సారెస్పీకి వరద వస్తుంది. కార్యక్రమంలో ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రావు గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ అప్పర్ గోదావరి డివిజన్ హైదరాబాద్ ఎంఎల్ ప్రాంక్లిన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాందేడ్ సీఆర్ బాన్సడ్, ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చక్రపాణి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తదితరులు పాల్గొన్నారు.

బాబ్లీ గేట్ల వద్ద మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు