అక్షరటుడే, వెబ్‌డెస్క్:Nizamabad Police | నగరంలో అర్ధరాత్రి వరకు దుకాణం తెరిచి ఉంచాడు ఓ వ్యక్తి. తీరా పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా.. జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం(Court) తీర్పునిచ్చింది. నగరంలోని అహ్మద్పురా(Ahmedpura colony)లో అర్ధరాత్రి వరకు కిరాణా షాప్ తెరిచి ఉంచిన షేక్ జుబేర్పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విచారించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate) అతడికి నాలుగు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని 2వ టౌన్ ఎస్హెచ్వో(2nd Town SHO) పేర్కొన్నారు.
Nizamabad Police | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న దుకాణం.. తీరా ఏమైందంటే..
Published on
