అక్షరటుడే, కామారెడ్డి : Tiger | కామారెడ్డి జిల్లాలో (Kamareddy District) పెద్దపులి సంచారం మరోసారి కలకలం రేపింది. రామారెడ్డి మండలం (Ramareddy Mandal) గోకుల్ తండాలో గురువారం రాత్రి ఓ ఆవుపై దాడి చేసింది. ఈ దాడిలో ఆవు మృతి చెందగా తాజా ఘటనతో ప్రజల్లో మరోసారి తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో తండాకు చెందిన బాదావత్ పుల్యా అనే రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి (Tiger) దాడి చేసింది. రోజు మాదిరిగానే ఆవులను మేతకు తీసుకువెళ్లి తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఆవును కట్టేసి.. ఇంటికి వచ్చి తిరిగి వెళ్లి చూసే సరికి ఆవుపై దాడి చేసినట్లు ఆనవాళ్లు కనబడ్డాయి. దీంతో వెంటనే రైతు పుల్యా తండావాసులకు సమాచారం ఇచ్చాడు. వారు అటవీశాఖ అధికారులకు (Forest Officers) సమాచారం చేరవేశారు.
Tiger | ట్రాక్ కెమెరాల ఏర్పాటు
అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి అధికారులు ఆవును పరిశీలించారు. అనంతరం.. పులి పాద ముద్రలను సేకరణ కోసం గాలించారు. తండా శివారులో పెద్దపులి కోసం రెండు ట్రాక్ కెమెరాలను (Track Cameras) ఫారెస్ట్ అధికారులు బిగించారు. పెద్దపులి సంచరించడంతో తండా వాసులు, సమీప గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆవుపై పులి దాడి చేసిన కాసేపటికి తండా వాసులు సుమారు 20 మంది ఆవు చనిపోయిన ప్రాంతానికి వెళ్లగా పెద్దపులిని చూసినట్టుగా తెలుస్తోంది. తండావాసులు పులిని తరిమికొట్టడంతో అడవిలోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. అన్నారం గ్రామంలోనూ (Annaram Village) గోకుల్ తండాలో దాడి కంటే ముందు బుధవారం అర్ధరాత్రి అన్నారం గ్రామంలో ఓ వ్యక్తికి పులి కనిపించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై ఆ వ్యక్తి వాట్సాప్ గ్రూపులో పెట్టడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. అయితే అది పులి కాదని నక్క అని అధికారులు వెల్లడించారు.
Tiger | వారం క్రితం స్కూల్ తండా శివారులో..
వారం రోజులుగా రామారెడ్డి, మాచారెడ్డి అటవీ ప్రాంతంలో (Machareddy Forest Area) పెద్దపులి సంచారంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం స్కూల్ తండా శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పులిపై విషప్రయోగం ప్రచారంతో పెద్దపులి జాడ కోసం అధికారులు అడవి మొత్తం జల్లెడ పడుతున్నారు. స్కూల్ తండా ఘటన మరవక ముందే మళ్లీ గోకుల్ తండాలో (Gokul Thanda) రాత్రి పెద్దపులి ఆవుపై దాడి చేయడం కలకలం రేపుతోంది. పెద్దపులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు.
Tiger | పెద్ద పులా.. చిరుతనా..
గోకుల్ తండాలో ఆవుపై దాడి చేసింది పెద్ద పులేనా లేక చిరుత పులా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోజుకు 20 కిలోమీటర్ల మేర తిరిగే పెద్ద పులి ఈ ప్రాంతంలో ఉండే అవకాశం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పులి సంచారం విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే తండాకు చేరుకుని అటవీప్రాంతంలో రెండు ట్రాక్ కెమెరాలను బిగించారు.
మరోసారి వచ్చిన పులి ఆవు కళేబరాన్ని ఎత్తుకెళ్లింది. ఈ ఘటన ట్రాక్ కెమెరాలో రికార్డు అయినట్టుగా తెలుస్తోంది. అయితే అయితే అది పెద్ద పులి కాదని, చిరుతగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అడవిలో పులిజాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.