అక్షరటుడే, డిచ్పల్లి: Governor Jishnu Dev Varma |జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్ వద్ద ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి(Rajya Sabha member Suresh Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(CP Sai chaitanya), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ(Battalion Commandant Satyanarayana), తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరి(TU Vice Chancellor Professor Yadagiri) తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
Governor Jishnu Dev Varma | పోలీసుల నుంచి గౌరవ వందనం..
ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన బెటాలియన్ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఉన్నతాధికారులతో కలిసి మొక్కలు నాటారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యార్థినితో కరచాలనం చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మొక్క నాటి మట్టి వేస్తున్న గరవ్నర్ జిష్ణుదేవ్ వర్మ