More
    HomeUncategorizedGreater Noida | బాంబ్‌లా పేలిన టాయిలెట్ కమోడ్​.. తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాత్‌రూంకి వెళ్లిన వ్య‌క్తి

    Greater Noida | బాంబ్‌లా పేలిన టాయిలెట్ కమోడ్​.. తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాత్‌రూంకి వెళ్లిన వ్య‌క్తి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Greater Noida | ఒక్కోసారి ఊహించ‌ని ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. తాజాగా గ్రేటర్ నోయిడాలో (greater noida) ఓ వింత ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లోని వెస్టర్న్‌ టాయిలెట్‌ (western toilet) కమోడ్ పేలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన‌ట్టు తెలుస్తుంది. సెక్టార్ 36లో (sector 36) నివసిస్తున్న అషు అనే 22 ఏళ్ల కుర్రాడు తన ఇంట్లో ఉన్న బాత్‌రూమ్‌లో టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే బయటకు వచ్చేటప్పుడు అషు కమోడ్‌కు ఉన్న ఫ్లష్‌ను నొక్క‌డంతో భారీ శబ్ధంతో ఆ కమోడ్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అషు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన అషు తండ్రి అతన్ని వెంటనే గ్రేటర్ నోయిడాలోని (greater noida) గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (government institute of medical sciences) లోని హాస్పిటల్‌కు తరలించారు. అషును పరీక్షించిన వైద్యులు అతనికి 35 శాతం కాలిన గాయాలైనట్లు నిర్ధారించారు.

    READ ALSO  Black box | బ్లాక్ బాక్సే కీలకం.. విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

    Greater Noida | ఎలా జ‌రిగింది..

    విద్యుత్ లోపాలు లేదా గాడ్జెట్ సంబంధిత సమస్యలు కావచ్చని తొలుత భావించారు. కానీ అషు తండ్రి సునీల్ ప్రధాన్, ఆ సమయంలో అషు మొబైల్ ఫోన్ (mobile phone) లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్‌ (electronic device) ఉపయోగించడం లేదని చెప్పుకొచ్చారు. ఇంట్లోని ఏసీలు, ఇతర యాక్సెసరీలు సాధారణంగా పనిచేస్తున్నాయి. కాబట్టి పేలుడు విద్యుత్ సమస్య (electrical problem) వల్ల సంభవించలేదని నిర్ధారించారు. నిపుణులు మీథేన్ గ్యాస్ (methane gas) పేరుకుపోవడమే కారణమని అనుమానిస్తున్నారు. మురుగునీరు వంటి వ్యర్థాలు కాల్వలు లేదా మురుగునీటి కాల్వల్లో కుళ్లిపోయినప్పుడు మీథేన్ మండే వాయువుగా ఉత్పత్తి అవుతుంది. ఇంట్లో మూసుకుపోయిన కాలువ వల్ల టాయిలెట్ బౌల్ లోపల మీథేన్ పేరుకుపోయి ఉండ‌వ‌వచ్చని అనుమానిస్తున్నారు.

    READ ALSO  RCB | ఐపీఎల్ విజేత కాగానే ఆర్సీబీ కొత్త నిర్ణ‌యం.. అమ్మకానికి పెట్ట‌బోతున్నారా..?

    స్పార్క్‌ వచ్చి మీథేన్‌ మండి పేలుడు సంభవించి ఉండవచ్చని చెబుతున్నారు. అయితే స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం అస్పష్టంగానే ఉంది. గ్రేటర్ నోయిడా (greater noida)లోని మురుగునీటి పైపులు చాలా పాతవని, చాలా అరుదుగా శుభ్రం చేస్తారని స్థానిక నివాసి హరీందర్ భాటి (harinder bhati) అన్నారు. పైపులు చాలా సంవత్సరాలుగా శుభ్రం చేయలేదు. వ్యర్థాలు నిండిపోయిన పైపుల్లో గ్యాస్‌ (gas) ఈజీగానే పెరుగుతుంది. ఒత్తిడి (pressure) పెరిగినప్పుడు పేలిపోవచ్చు అని చెప్పారు. ఇంటి నుంచి వ్యర్థాలు బయటకు వెళ్లే కాల్వలు, డ్రెయిన్లు బ్లాక్‌ కాకుండా చూసుకోవ‌డం మంచింది. దీని వల్ల కుళ్లిపోయి మీథేన్ గ్యాస్‌ (methane gas) ఉత్పత్తి అవుతుంది. అలానే బాత్రూమ్‌లలో వెంటిలేషన్ (ventilation) బాగుండేలా చూసుకోవాలి.

    Latest articles

    Vijay Rupani | గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు నేడు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Rupani : గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను నేడు(జూన్​...

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూ.ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...

    AP GOVT | లక్ష మంది పేద విద్యార్థులకు JEE, NEET ఉచిత కోచింగ్ .. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది పేద మరియు సాధారణ కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా JEE, NEET...

    More like this

    Vijay Rupani | గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు నేడు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Rupani : గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను నేడు(జూన్​...

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూ.ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...