అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar project | వందేళ్ల చరిత్ర గల నిజాంసాగర్ ప్రాజెక్ట్‌పై (nizamsagar project) పట్టింపు కరువైంది. ఒకప్పుడు పర్యాటకులకు (tourists)ఆహ్లాదాన్ని పంచిన ప్రాజెక్ట్ అందాలు.. ఇప్పుడు కనమరుగవుతున్నాయి. వేసవి వచ్చిందంటే పర్యాటకుల రద్దీగా ఉండే జలాశయం పరిసరాలు ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తున్నాయి.
నిజాం హయాంలో మంజీర నదిపై (majeera river) నిజాంసాగర్ మండలం అచ్చంపేట– బంజేపల్లి గ్రామాల (achampet-bajempally villages) పరిధిలో 1923-31 మధ్యకాలంలో నిర్మించారు. ప్రధాన ఇంజినీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేశారు. 1405 అడుగుల ఎత్తు, 30 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (joint nizamabad district) 2.70 లక్షల ఎకరాలకు ఈ జలాశయం ద్వారా సాగునీరు అందుతోంది. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ (project construction) సమయంలోనే ప్రజల ఆహ్లాదం కోసం పలు నిర్మాణాలు చేపట్టారు. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి.
Nizamsagar project | నిర్వహణ లేకపోవడంతో..
ప్రాజెక్ట్ వద్ద సమ్మర్ బాగ్, స్మిమ్మింగ్‌పూల్, గోల్ బంగ్లా నిర్మించారు. నిజాం హయాంలో కట్టిన ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ప్రాజెక్ట్ సందర్శనకు నిత్యం పర్యాటకులు తరలి వచ్చేవారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర (maharastra), కర్నాటక (karnataka) నుంచి కూడా ప్రాజెక్ట్ అందాలు చూసేందుకు వచ్చేవారు. ప్రాజెక్ట్ దిగువన ఉన్న సమ్మర్ బాగ్‌లో దొరికే పండ్లను తినేవారు. స్విమ్మింగ్‌పూల్ ఆహ్లాదంగా గడపడంతో పాటు, గోల్‌బంగ్లా తదితర ప్రాంతాల్లో సేద తీరేవారు. పట్టించుకునే వారు లేకపోవడంతో సమ్మర్బాగ్లో చెట్లన్నీ ఎండిపోయాయి. స్విమ్మింగ్‌పూల్‌లో నీరు (swimming pool water) నింపడం లేదు. ఫౌంటేన్ కూడా నిరుపయోగంగా మారింది.
Nizamsagar project | పత్తాలేని బోటు షికారు
నిజాంసాగర్ ప్రాజెక్ట్ (nizamsagar project) చూడడానికి వచ్చే పర్యాటకులు గతంలో బోటులో షికారు చేసేవారు. గతంలో బోటు అందుబాటులో ఉండేది. దీంతో పర్యాటకులు (tourists) అందులో షికారు చేసి జలాశయం అందాలను తిలకించేవారు. కానీ కొన్నేళ్లుగా ఇక్కడ బోటు షికారు లేకుండా పోయింది. దీంతో పర్యాటకుల తాకిడి క్రమంగా తగ్గిపోతోంది. అధికారులు స్పందించి ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా (tourist center) మార్చి, వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.