అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nidhhi Agerwal | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం (Hari Hara Veera Mallu Movie) జులై 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం ఈ చిత్రం నుంచి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు (Trailer release) కేవలం ఒక రోజు ముందు, చిత్రబృందం పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన స్టిల్‌ను విడుదల చేసి, సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. పోస్టర్‌లో పవన్ కల్యాణ్ ధనుస్సుతో గంభీరంగా కనిపిస్తూ, తన పాత్ర ఎలా ఉంటుదో చిన్న హింట్ ఇచ్చారు. ఆయన స్టైల్, హావభావాలు, పవర్‌ఫుల్ ప్రెజెన్స్ అభిమానుల మనసు దోచుకుంటున్నాయి. రేపు (గురువారం) థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుండటంతో ఈ పోస్టర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Nidhhi Agerwal | న్యూ గెటప్‌లో..
మరోవైపు ఈ చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) పాత్ర హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన అప్డేట్స్ ప్రకారం, ఈ చిత్రంలో నిధి మునుపెన్నడూ చూడనటువంటి లుక్‌లో కనిపించబోతుంది. శక్తివంతమైన పాత్ర, హెవీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆమె అభిమానులను ఆశ్చర్యపరచనుంది. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనుండటం, ఆమె గెటప్, పాత్రలో మార్పులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయన్న టాక్ ఇండస్ట్రీలో (Film industry) జోరుగా వినిపిస్తోంది. ఒక వైపు పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మాస్ అప్పీల్, మరోవైపు నిధి అగర్వాల్ న్యూ అవతార్ ఈ సినిమా మీద భారీ అంచనాలు పెంచేస్తున్నాయి.
కొత్త నిధిని చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ చిత్రబృందం (Movie team) ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హిస్టారికల్ యాక్షన్ డ్రామా (action drama) నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu)లో నిధి అగర్వాల్ కొత్త గెటప్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి . ఈ చిత్రం మొఘల్ సామ్రాజ్య కాలంలో చోటుచేసుకున్న నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. సామ్రాజ్యపు అణచివేతకు వ్యతిరేకంగా సామాన్యుల హక్కుల కోసం పోరాడే బందిపోటు యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ప్రారంభంలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని రూపొందించగా, అనంతరం దర్శకత్వ బాధ్యతలు ఏఎం జ్యోతికృష్ణ తీసుకున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతం అందించారు. ఇప్పటివరకు విడుదలైన నాలుగు పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుని, సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.