అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth | తెలంగాణలోని అసంఘటిత కార్మికుల కోసం దేశానికి రోల్ మోడల్‌గా ఉండే ఒక మంచి విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం (May Day) సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామన్నామని సీఎం రేవంత్ తెలిపారు.
CM Revanth | లాభాల్లోకి ఆర్టీసీ
ఒకనాడు నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ.. ఈరోజు లాభాల బాటలోకి వచ్చిందని సీఎం అన్నారు. ఇందులో కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాని పేర్కొన్నారు.
CM Revanth | సమస్యలపై మంత్రితో చర్చించండి
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లాలని చర్చిస్తున్నారని, ఈ సంస్థ కార్మికులదే అన్నారు. పట్టింపులకు వెళ్లొద్దని సూచించారు. రాజకీయంగా ఎవరైనా ప్రోత్సహిస్తే, ఏదైనా తప్పుగా నిర్ణయం తీసుకుంటే మొత్తం వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని సీఎం తెలిపారు. కార్మికుల సమస్యలపై మంత్రితో చర్చించాలని సూచించారు. ప్రభుత్వం చేయగలిగిందేమున్నా చేస్తామని హామీ ఇచ్చారు. కార్మిక చట్టాలను సవరించి కార్మికులను ఆదుకునే విధానాన్ని తెచ్చి, దేశానికి మార్గదర్శిగా తెలంగాణ నిలబెడుతాం.
CM Revanth | సింగరేణి కార్మికులకు బీమా
సింగరేణి సంస్థ లాభాల బాటలో నడవడమే కాకుండా గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో కార్మికులకు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు బోనస్ చెల్లించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్మికులకు బీమా సౌకర్యం అమలు చేస్తున్నామని చెప్పారు. సింగరేణిలో దాదాపు 400 పైచిలుకు కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాలు చేపట్టామని వివరించారు. కార్మికులకు కష్టాలున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలంటే కొంత సమయం కావాలన్నారు.